ఖలీల్‌వాడి (నిజామాబాద్) : న్యాయ వ్యవస్థ, మానసిక ఆరోగ్య రంగాల మధ్య మైత్రీని బలోపేతం చేయడం ద్వారా సమసమాజాన్ని నిర్మించగలుగుతామని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ (Doctor Vishal) అన్నారు. హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ( Legal cell Authority) వర్క్‌షాప్‌లో మానసిక రుగ్మతలపై హైదరాబాద్ రాజ్ భవన్‌లోని సంస్కృతి హాల్లో శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుంచి వైద్య నిపుణులు విశాల్ ఆకుల హాజరై మాట్లాడారు . ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణంలో మానసిక వైద్యులు కీలక పాత్రను పోషిస్తున్నారని పేర్కొన్నారు. వర్క్‌షాప్‌లో రిటైర్డ్ ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి మొహమ్మద్ షమీమ్ , ప్రముఖ మధ్యవర్తులు మొహమ్మద్ ఆసిఫ్, సీతా దేవి, పంచాక్షరి పాల్గొన్నారు.