పోతంగల్ : ప్రభుత్వం గర్భిణులకు( Pregnant women ) అందించే పౌష్టికాహారాన్ని ( Nutritious food ) తీసుకుని తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని నూతన సర్పంచులు కోరారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లపల్లిఫారం అంగన్వాడీ కేంద్రంలో ( Angalwadi Centres ) గురువారం గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జల్లపల్లి, జల్లపల్లిఫారం, జల్లపల్లి తండా సర్పంచులు వివేక్, దస్తగిరి, రాజు హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంలో ఎంతో విలువైన పోషకాలుంటాయని వివరించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులను అంగన్వాడీ టీచర్ రజియా బేగం సన్మానించారు. కార్యక్రమంలో ఉపసర్పంచులు సునీత, గణేష్ తదితరులు పాల్గొన్నారు.