Nizamabad Commissionerate | నిజామాబాద్ కమిషనరేట్‌లో 9 మంది ఎస్ఐలకు పోస్టింగులు
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)లో ఉన్న సబ్ ఇన్స్ పెక్టర్ లకు వివిధ పోలీస్ స్టేషన్ల లో పోస్టింగ్ లు ఇస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఎస్ హెచ్ ఓ లుగా విధులు నిర్వర్తించిన ఎస్సై లను వివిధ కారణాల వల్ల వీఆర్‌కు బదిలీ చేశారు.
- సీపీ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ
Nizamabad Commissionerate | వినాయక్ నగర్, సెప్టెంబర్ 20 : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)లో ఉన్న సబ్ ఇన్స్ పెక్టర్ లకు వివిధ పోలీస్ స్టేషన్ల లో పోస్టింగ్ లు ఇస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఎస్ హెచ్ ఓ లుగా విధులు నిర్వర్తించిన ఎస్సై లను వివిధ కారణాల వల్ల వీఆర్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం వీఆర్ లో ఉన్న 9 మంది ఎస్ఐలకు కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో పోస్టింగ్ కల్పిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
వీఆర్ లో ఉండి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ అటాచ్డ్గా పనిచేస్తున్న ఎస్సై గోవింద్ ను నిజామాబాద్ సీఈసీఎస్ కు బదిలీ చేశారు. ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ లో అటాచ్డ్గా ఉన్న సిలివేరి మహేష్, వీఆర్ లో ఉన్న గంగుల మహేష్ ను నిజామాబాద్ సీసీఎస్ లో పోస్టింగ్ కల్పించారు. గురుక మహేష్ నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు, సామ శ్రీనివాస్ సౌత్ రూరల్ సీఐ ఆఫీస్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ-2 గా బదిలీ చేశారు.
మొగులయ్య వన్ టౌన్ అటాచ్డ్ నుండి మాట్లూర్ ఎస్సై-2 గా బదిలీ చేశారు. వినయ్ కుమార్ వీఆర్ నుండి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు, సైనా రావు వీఆర్ నుండి స్పెషల్ బ్రాంచ్ విభాగానికి, బీబీఎస్ రాజును వీఆర్ నుండి కలెక్టరేట్ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగులు ఇచ్చిన సిబ్బంది వెంటనే తమకు కేటాయించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

