Polling equipment | పోతంగల్, డిసెంబర్ 10 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం నిర్వహించే మొదటి విడత ఎన్నికలకు పంచాయతీలకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మండల కేంద్రానికి పోలింగ్ సిబ్బంది బుధవారం చేరుకున్నారు. వారికి అవసరమయ్యే పోలింగ్ సామగ్రిని అధికారులు సిబ్బందికి అందజేశారు. అక్కడ కావాల్సిన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సిబ్బందికి అందజేశారు. డీఎల్పీవో నాగరాజు పోలింగ్ సిబ్బందికి పంపిణీ చేస్తున్న సామగ్రిని ఆయన పరిశీలించారు.
20 గ్రామ పంచాయతీల గాను ఒక గ్రామపంచాయతీ ఏకగ్రీవం అవడంతో 19 గ్రామపంచాయతీలలో పోలింగ్ జరగనుంది. 290 వార్డు మెంబర్లకు గాను 62 మంది ఏకగ్రీవం కాగా 228 వార్డ్ మెంబర్లు బరిలో ఉన్నారు. మండలంలోని గ్రామపంచాయతీలకు 19 మంది ఆర్వోలు, 160 మంది పీవోలు, 130 మంది పోలిస్ సిబ్బంది, 197 మంది ఓపివోలు విధులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు ఎంపీడీవో చందర్, ఎమ్మార్వో గంగాధర్, ఎంఈఓ శంకర్, ఎస్ఐ సునీల్ తదితరులు ఉన్నారు.