వినాయక్‌నగర్ : నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాలను ( Chief Judge Sunita ) నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ( Sai Chaitanya ) మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన గురువారం నిజామాబాద్ జిల్లా కోర్టు కార్యాలయంలో న్యాయమూర్తి సునీత కుంచాలను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పోలీస్ కమిషనర్‌ను స్వాగతిస్తూ అభినందించారు.