బాన్సువాడ, జూన్ 22: దేశంలోనే దివ్యాంగులకు అత్యధికంగా పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో బాన్సువాడ పట్టణ, గ్రామీణ, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సం దర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఎవరూ పెంచమని అడగకపోయినా దివ్యాంగుల బాధలను అర్థం చేసుకొని సీఎం కేసీఆర్ మరో వెయ్యి రూపాయల పింఛన్‌ను పెంచారన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పింఛన్‌ను భారీగా పెంచడంతో అనేకమంది అ ర్హత లేకున్నా పింఛన్ పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఇది మంచిది కాదని అన్నారు. దివ్యాంగుల న్యా యమైన డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
బాన్సువాడ పట్టణంలో దివ్యాంగుల భవనం కోసం మున్సిపల్ నుంచి 200 గజాల స్థలాన్ని ఇ ప్పించాలని, భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. అనంతరం దివ్యాంగులతో కలిసి స్పీకర్ సహపంక్తి భోజనం చేశారు. డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి దివ్యాంగులకు స్వయం గా భోజనాన్ని వడ్డించారు. దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన భా స్కర్రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, ఎంపీపీ దొడ్ల నీరజావెంకట్‌రాంరెడ్డి, పాల్త్య విఠల్, రఘు, కమిషనర్ రమేశ్, ఏఎంసీ చైర్మన్ నర్సింహులు, తహసీల్దార్ గంగాధర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.