Pocharam project |నాగిరెడ్డిపేట్, ఆగస్టు 7 : పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని పొంగిపొర్లు తుండడంతో వానకాలం పంటల సాగు కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రాజెక్టు గేట్లను శుక్రవారం ఎత్తి 150 క్యూసెక్కుల నీరు దిగువ విడుదల చేశారు. ప్రాజెక్టు కెపాసిటీ 1.820.టీఎంసీలు ఉండగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకొని పొంగిపొర్లుతోంది.
దీంతో చెరువులు కుంటలు నిండుకుంటాయని నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. విడుదల చేసిన నీరు 15 రోజులపాటు దిగువకు వెళతాయని ఆ తర్వాత పది రోజులపాటు నిలుపుదల ఉంటుందని వారు పేర్కొన్నారు. ఆయకట్టు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.