18 ఏండ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం?.. ప్రత్యేక చట్టాలపై సుప్రీంకు కేంద్రం హామీ
దేశంలో 18 ఏండ్లలోపు వినియోగదారులకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు భారత చట్టాలను, ముఖ్యంగా మైనర్ల విషయంలో పాటించేలా ప్రత్యేక చట్టాలను తీసుకువచ్చే విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: దేశంలో 18 ఏండ్లలోపు వినియోగదారులకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు భారత చట్టాలను, ముఖ్యంగా మైనర్ల విషయంలో పాటించేలా ప్రత్యేక చట్టాలను తీసుకువచ్చే విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. పిటిషనర్ తరఫున వాదించిన హెచ్ఎస్ పూల్కా, కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా 18 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా కంపెనీలతో చట్టబద్ధమైన ఒప్పందాలు చేసుకోరాదని, అటువంటి ఒప్పందాలను నివారించడానికి ప్లాట్‌ఫారాలు రక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు తెలిపారు.
అంతేకాకుండా కేవలం కంపెనీలను స్వచ్ఛందంగా బాలల భద్రతా చర్యలను పాటించమని కోరడానికి బదులుగా, సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం చట్టబద్ధంగా కట్టుబడి ఉండే నిబంధనలను రూపొందించడాన్ని ప్రభుత్వం పరిగణించాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఈ అంశాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిబంధన కేవలం మార్గదర్శకంగా మిగిలిపోకుండా చట్టబద్ధమైన బలాన్ని కలిగి ఉండాలని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు పిల్లలకు సంబంధించి భారతీయ చట్టాలను వాస్తవంగా పాటిస్తున్నాయా, లేదా అని కేంద్రం నిర్ధారించుకోవాలని జస్టిస్ బాగ్చి కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా ప్రారంభమైన సహస్రనామావళి సహిత కోటి పుష్పార్చన
Mysaa | 29 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన వందేమాతరం – సుద్దాల.. ‘మైసా’ నుంచి పవర్ఫుల్ విప్లవ గీతం నేడే!
IND vs NZ | కివీస్‌కు దీటుగా జవాబిస్తున్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే..
NHRC | తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల దుస్థితిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
Vishwambhara | ఎట్టకేలకు ఊపందుకున్న మెగాస్టార్ ‘విశ్వంభర’.. ట్రైలర్ రెడీ, రిలీజ్ డేట్ ఎప్పుడో?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

