కథువా: తోటి జవాన్ జరిపిన కాల్పుల్లో నలుగురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది మృతి చెందిన ఘటన జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లాలో జరిగింది. సేవా 2 హైడల్ పవర్ ప్రాజెక్టు వద్ద క్యాంప్‌లో విధులు మారుతుండగా సీఐఎస్ఎఫ్ జవాన్ల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో ఒక జవాన్ మిగిలిన వారిపై కాల్పులు జరపడంతో నలుగురు తీవ్రంగా గాయపడి మరణించారు. మృతులలో అసిస్టెంట్ కమాండెంట్, ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు.
మరోవైపు అరుణాచల్‌ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్ జిల్లాలో భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలో అస్సాం రైఫిల్స్ పెట్రోలింగ్ బృందంపై మిలిటెంట్లు దాడి చేశారు. మంగళవారం ఉదయం సుమారు 6:30 గంటలకు నాపాంగ్ సర్కిల్లోని నాపాంగ్ నాలా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఓ జవాన్ మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.