ఎల్లారెడ్డి రూరల్/ మాచారెడ్డి/ చందూర్, సెప్టెంబర్ 20: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచి ఇవ్వాలని కోరు తూ ఎల్లారెడ్డి మండలంలోని భిక్నూర్, మోస్రా మండలం లోని చింతకుంట గ్రామ పంచాయతీలను పింఛన్‌దారులు శనివారం ముట్టడించారు. మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచుతామని ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు.. అధికారం చేపట్టి 20నెలలు గడుస్తున్నా ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పింఛన్లు పెంచి పంపిణీ చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. అనంతరం భిక్నూర్ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. భిక్నూర్లో ఎమ్మార్పీఎస్ నాయకులు కంతి పద్మారావు, శివానంద, సౌందర్య, అక్కాపూర్‌లో ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు బట్ట రమేశ్, చింతకుంటలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చందన, పింఛన్‌దారులు పాల్గొన్నారు.