kamareddy | బాన్సువాడ, జూన్ 30 : కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ పట్టణం, జుక్కల్ నియోజక వర్గం మలి దశ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో టీయూఎఫ్ కమిటీ పిలుపు మేరకు సోమవారం శాంతియుత దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఉడుత గంగాధర్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇంటినిర్మాణ కోసం 250 గజాల స్థలం ఇస్తామని, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇస్తామని హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు చెందు, భాస్కర్ గౌడ్, మహేష్, గుల సాయికుమార్, కృష్ణ, తూము హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.