సంక్రాంతి పండుగ నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులు తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. దీంతో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ శనివారం కిక్కిరిసి పోయింది. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు నానాపాట్లు పడాల్సివచ్చింది.
కొందరు కిటికీల నుంచి తమ చిన్నారులను లోపలికి పంపించగా..మరికొందరు డ్రైవర్ సీటు నుంచి చొచ్చుకెళ్లారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడపకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తంచేశారు.
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్