డిచ్పల్లి, ఫిబ్రవరి 2 : మండలంలో ఆర్టీసీ బస్ కండక్టర్‌పై ప్రయాణికుడు శుక్రవారం దాడి చేశాడు. బాధిత కండక్టర్ రేయికుంట దేవదాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సులో కుప్రియాల్ వద్ద ప్రయాణికుడు దొంతుల రవి బస్సు ఎక్కాడు. డిచ్పల్లి వరకు తీసుకున్న బస్‌పాస్ చూయించాడు. డిచ్పల్లి స్టేజ్ రాగానే కండక్టర్ అతడిని బస్సు దిగాలని కోరాడు. తాను ప్రతిరోజూ గాంధీనగర్ కాలనీ వరకు ఇదే బస్‌లో వెళ్తానని, అక్కడే దిగుతానని రవి బదులిచ్చాడు. పాస్ ఇక్కడి వరకే ఉందని,
ఇక్కడి నుంచి టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని కండక్టర్ చెప్పడంతో ఆగ్రహానికి గురైన రవి.. కండక్టర్‌ను దుర్బాషలాడుతూ చేయి చేసుకున్నాడు. కండక్టర్ చేతిలోని టికెట్ మిషన్, క్యాష్‌బ్యాగ్‌ను లాక్కొని పొదల్లోకి విసిరివేశాడు. స్థానిక కంట్రోలర్ చందర్‌నాయక్ డిచ్పల్లి పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని రవిని అదుపులోకి తీసుకుకున్నా రు. కండక్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.