Nizambad | కోటగిరి, ఆగస్టు 4 : కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులకు కోటగిరి హైస్కూల్ విశ్రాంతి ఉపాధ్యాయుడు రమేష్ చేయుత నందించారు. అస్య ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో 25మంది పేద విద్యార్థులకు కోటగిరి మండల విద్యాధికారి శ్రీనివాస రావు చేతుల మీదుగా బ్యాగులు, పెన్నులు సోమవారం పంపిణీ చేశారు.
తల్లిని నిరుపేద పిల్లలకు రమేష్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్లకు బ్యాగులు అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టి పేదలకు ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు పార్వతి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.