Kotagiri | కోటగిరి, మార్చి 17 : రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా గ్రామపంచాయతీ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొనేందుకు సిద్ధమైన పలువురు పంచాయతీ కార్మిక నాయకులు, సిబ్బందిని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఏతోండ గ్రామంలో హౌస్ అరెస్ట్ చేశారు.
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే హైదరాబాద్ వెళుతున్నామని అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని పంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షులు రాజేశ్వరి స్పష్టం చేశారు అరెస్టయిన వారిలో పంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు రాజేశ్వరి ఉన్నారు.