కంటేశ్వర్, డిసెంబర్ 30 : రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం(BC Employees Association) సంయుక్త కార్యదర్శిగా బోధన్ సీడీపీఓ తాళ్ల పద్మను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ గౌడ్ నియామకపత్రాన్ని అందజేశారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పద్మను రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు.
నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కరిపే రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. రమా, జిల్లా ఉపాధ్యక్షులు దారం భూమన్నలు పాల్గొనగా పద్మను నియామకం చేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ..బీసీ ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు వెళ్తామని, తనవంతు బాధ్యతను శక్తిమేర నిర్వహిస్తానని చెప్పారు. అవకాశం కల్పించిన రాష్ట్ర, జిల్లా బాధ్యులకు కృతజ్ఞతలు చెప్పారు.