కమ్మర్పల్లి/వేల్పూర్/నవీపేట/ కోటగిరి/ఇందల్వాయి, ఏప్రిల్ 16 : జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం ప్రారంభించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో, వేల్పూర్ మండలంలోని మోతెలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారన్నారు. కమ్మర్‌పల్లిలో పీఏసీఎస్ చైర్మన్ రేగుంట దేవేందర్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బద్దం రాజేశ్వర్, వీడీసీ అధ్యక్షుడు బద్దం రాజేశ్, పీఏసీఎస్ డైరెక్టర్లు అవారి గంగా రెడ్డి, రెంజర్ల మహేందర్, తీగల హరీశ్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు అజ్మత్ హుస్సేన్, బీఆర్ఎస్ నాయకులు సంత నడ్పి రాజేశ్వర్, బామని రాజన్న, కార్యదర్శి శంకర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
మోతెలో సొసైటీ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్ కల్లెం రాజేశ్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర్, దొర్ల రాజేశ్వర్‌రెడ్డి, పాలెపు బాలరాజు, చంద్రమోహన్‌గౌడ్ పాల్గొన్నారు.
నవీపేట మండలంలోని బినోలా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ మగ్గరి హన్మాండ్లుతో కలిసి ఎంపీపీ సంగెం శ్రీనివాస్ ప్రారంభించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని అన్నారు. బినోలా సొసైటీ పరిధిలో నాళేశ్వర్, నిజాంపూర్, ఆశజ్యోతి కాలనీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పీతంబర్, ఎంపీటీసీ పద్మా విజయ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ అయిటి దేవేందర్, సొసైటీ డైరెక్టర్ అంజగౌడ్, సొసైటీ సీఈవో రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
కోటగిరి మండలం పొతంగల్ మండలం హంగర్గా గ్రామంలో పొతంగల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విండో వైస్ చైర్మన్ గంధపు పవన్‌కుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. క్వింటాలు ధాన్యానికి ప్రభుత్వం రూ.2,060 మద్దతు ధరను అందజేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీతా విజయ్‌పటేల్, కోటగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, విండో డైరెక్టర్ విజయ్‌పటేల్, ఉపసర్పంచ్ సుభాష్, ఎస్కే బాబు, పుట్టి శంకర్, పంజా మారుతి, రైతులు పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామంలో రాంపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ తారాచంద్‌నాయక్.. సర్పంచ్ లోలం సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సొసైటీ చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రఘునందన్‌రావు, గంగాధర్, కిషన్, సంతు, రైతులు పాల్గొన్నారు.