చందూర్ : తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా ప్రారంభమయ్యే వరి కోతలు (Paddy harvesting) నిజామాబాద్(Nizamabad) జిల్లాలో మొదలయ్యాయి. ముఖ్యంగా వర్ని, చందూర్, మోస్రా, రుద్రూర్ మండలాల్లో అన్ని జిల్లాలో కంటే ఈ మండలాల్లో వరికొతలు మొదలవుతాయి. ముఖ్యంగా బోర్ల వద్ద పండించే పంట కోతకు రావడంతో రైతులు కోతలు ప్రారంభించారు.
చందూర్ మండల కేంద్రానికి చెందిన యువరైతు చంద్రకాంత్ శుక్రవారం తన 13 ఎకరాల పొలాన్ని కోతకోయించి ప్రైవేట్ వ్యక్తులకు రూ. 2,100 చొప్పున మద్దతు ధరకు ధాన్యం అమ్మినట్టు తెలిపారు. గత సంవత్సరం రైతులు తమ పంటలు కోసిన చివరి దశలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ముందుగా అమ్ముకున్న రైతులు నష్టపోయినట్టు తెలిపారు.
ఈసారైనా ప్రభుత్వం వరి కోతలు ప్రారంభం దశలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రూ. 500 లు బోనస్( Bonus ) కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేటు దళారులకు అమ్మడంతో నష్టపోతున్నారని తరువాత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఉపయోగం ఉండదని వారు వెల్లడించారు.