MLA Venkataramana Reddy |కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడు రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్రమంత్రిని ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్టిలో పెట్టుకొని స్నేహపురి కాలనీ నుండి కలెక్టర్ ఆఫీస్ రోడ్ వరకు రైల్వే లైన్ మీదుగా ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జి, వికాస్ నగర్ కాలని నుండి ఇస్లాంపూర వరకు రైల్వే లైన్ మీదుగా ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జి, పాత రాజంపేట రైల్వే గేట్ వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి ప్రియ టాకీస్ రోడ్డు నుండి ఇందిరా చౌక్ వరకు రైల్వే స్టేషన్ మీదుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి పాదచారులు నడుచుకుంటూ వెళ్లేందుకు నిర్మించాలని కోరారు. కాగా ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో రైల్వే అధికారులు స్థల పరిశీలన చేయాలని కేంద్ర మంత్రి ఆదేశించినట్లు చెప్పారు.