Telangana University | కంటేశ్వర్, డిసెంబర్ 12 : ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు, సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి , ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తదితరులకు తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీకి అగ్రికల్చర్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు అయినందున వెంటనే రూ.200కోట్లు మంజూరు చేయాలని, యూనివర్శిటీ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని. యంగ్ ఇండియా, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ప్రారంభం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన విద్యను పేదలకు చేరువ చేయడం సంతోషకరమని పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన స్వగ్రామంలోని తన స్వంత భూమిని పాఠశాల నిర్మాణం కోసం దానం చేయడం జిల్లాకే గర్వకారణమని, గతంలోను గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్సీ, 50ఎకరాల భూమి దానం చేయడం గొప్ప విషయం అని తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పుప్పాల రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పుప్పాల రవి, టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ జీ లోకయాత్, ప్రొఫెసర్స్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.