Pocharam Srinivas Reddy | పోతంగల్ డిసెంబర్ 8 : స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి చేసే వారినే గెలిపించాలని వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని పలు కాలనీలలో సర్పంచ్ అభ్యర్థి గంధపు చైతన్య పవన్ కుమార్ కు మద్దతుగా స్థానిక నాయకులతో కలిసి సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ.. పేదల సంక్షేమం నియోజకవర్గ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక సమస్యలపై అవగాహన కలిగి ఉండి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసే వారిని సర్పంచ్ గా గెలిపించాలని అన్నారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, గ్రామ అభివృద్ధి కోసం పని చేసే సర్పంచ్ అభ్యర్థి గంధపు చైతన్య పవన్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఆయన వెంట ఆగ్రో ఇండస్ట్రీస్ కాసుల బాలరాజ్, సీనియర్ నాయకులు పుప్పాల శంకర్, శంకర్ పటేల్, కేశ వీరేశం, వర్ణిశంకర్, గంట్ల విట్టల్, రమేష్ సెట్, నబీ, సందని, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.