లింగంపేట్ : కామారెడ్డి (Kamareddy) జిల్లా తాడ్వాయి మండలం దేవయ్యపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య(48) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి విద్యుత్ షాక్తో (Electric shock ) మృతి చెందినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. పెళ్లి పందిరి కోసం కొమ్మలు నరకడానికి చెట్టు పైకి ఎక్కిన సమయంలో కొమ్మలు విరిగిపడడంతో మల్లయ్య విద్యుత్ తీగలపై పడ్డాడని తెలిపారు.
దీంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడని వివరించారు. మృతుని భార్య కిష్టవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.