Banswada | బాన్సువాడ, జూన్ 19 : మున్సిపల్ కార్మికులకు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని సీఐటీయూ యూనియన్ అధ్యక్షుడుడు మసూద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26 వేలు అందించాలని తదితర డిమాండ్లను వివరించారు.
మున్సిపాలిటీ లో కార్మికుల కు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని, 60 సంవత్సరాల వయసు కల కార్మికులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు కార్మికులుగా తీసుకోవాలని, కనీస వేతనం రూ.26 వేలివ్వాలని కార్మికుల డిమాండ్ చేశారు. ఈ మేరకు మేనేజర్ మల్లికార్జున్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మక్కల్ సాయిలు, రాజు, తాటి గంగారం, ఉప్పరి లక్ష్మి, సునంద, స్వాతి తదితరులు పాల్గొన్నారు.