భారత రాష్ట్ర సమితి అవతరణ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొన్నారు. జాతీయ పార్టీగా అవతరించిన సందర్భంగా భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు , పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు ప్రముఖులు వారి అభిప్రాయాలు వెల్లడించారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే.. బీఆర్ఎస్ జెండా ఎగరాలని పేర్కొన్నారు. దేశాభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఖలీల్‌వాడి డిసెంబర్ 9: దేశానికి నిజమైన స్వాతంత్య్రం రాబోతుంది. ఏ స్ఫూర్తితో స్వాతంత్య్రాన్ని సాధించామో, ఏ ఆకాంక్షలతో స్వరాజ్యన్ని పొందామో, ఏ కలలతో స్వేచ్ఛను పొందామో అది నెరవేరబోతున్న తరుణమిది. రాష్ట్ర సాధనకు కేసీఆర్ అలుపెరుగని పోరాటలు చేశారు. ప్రస్తుతం దేశాన్ని కాపాడేందుకు, రైతుల బాధలు తీర్చేందుకు బీఆర్ఎస్గా అవతారం ఎత్తారు. దేశాన్ని కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టింది.
– నరాల సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్
నిజాంసాగర్, డిసెంబర్ 9:దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే సత్తా సీఎం కేసీఆర్‌కు ఉన్నది. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. గ్రామాలు ప్రగతి పథంలో దూసుకుపోతూ జాతీయస్థాయిలో అవార్డులు అందుకుంటున్నాయి. దేశం మరింత అభివృద్ధ్ధి సాధించాలంటే కేసీఆర్ ఒక్కడి వల్లే అవుతుంది. ప్రజలంతా ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. కేసీఆర్‌తోనే దేశంలోని పేద, బడుగు, బలహీనవర్గాల ఆకాంక్షలు నెరవేరుతాయి.
– కాశయ్య, ముదిరాజ్ సంఘం నాయకుడు, మహ్మద్‌నగర్
బాన్సువాడ, డిసెంబర్ 9: దేశ రాజకీయాలు భ్రష్టు పడుతున్న తరుణంలో బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ఆవిర్భవించడం దేశానికి శుభసూచకం. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలకు అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం శుభపరిణామం.
– శ్రీనివాస్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు, బోర్లం.
పిట్లం, డిసెంబర్ 9:రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు యావత్ దేశ ప్రజలు ఆకర్షితులవుతున్నారు. జాతీయ రాజకీయాల్లో విజయం సాధించి ఇదే తరహాలో పథకాలను దేశ ప్రజలందరికీ అందిస్తారు. ప్రస్తుతం కేసీఆర్ సేవలు దేశానికి ఎంతో అవసరం. ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై తపన ఉన్న నాయకుడు. ఆయనకు యావత్ దేశ ప్రజలు మద్దతు పలుకుతారు.
– సక్రూసింగ్, రిటైర్డ్ పోలీసు ఉద్యోగి, సిద్ధాపూర్
భీమ్‌గల్, డిసెంబర్ 9: దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ మార్క్ కచ్చితంగా ఉంటుం ది. బీఆర్ఎస్ పార్టీతో ఇది మరింత సాధ్యమవుతుంది. ఇప్పటికే అనేక రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా ఉన్నది. దీనికి ఉదాహరణ పేదలకు లభిస్తున్న ఉచిత కార్పొరేట్ వైద్యం. ఇలాంటి మంచి పథకాల కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు.
– పోడెండ్ల సాయి కుమార్, హోమియో వైద్యుడు, భీమ్‌గల్
బాల్కొండ, డిసెంబర్ 9 : బీఆర్ఎస్ ఆవిర్భవించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా అమలు కాలేదు. ఇలాంటి పథకాలు దేశమంతా అమలు చేసి దేశ్‌కీ నేత కావాలి.
– సిరియల్ జగన్, అడ్వకేట్, బాల్కొండ
డిచ్పల్లి, డిసెంబర్ 9:ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అనతికాలంలోనే అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నది. అడగకుండానే అనేక సంక్షేమ ఫలాలు ప్రజల ముంగిట్లోకి తెచ్చిన సీఎం కేసీఆర్.. తెలంగాణ ఫలాలు దేశవ్యాప్తంగా విస్తరించాలన్న దృఢసంకల్పంతో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి చరిత్ర సృష్టించారు. భారత ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ పార్టీకి రాజముద్ర వేయడం శుభపరిణామం. దేశ రాజకీయాల్లో కేసీఆర్ చురుకైన పాత్ర పోషిస్తారు.
– వెంకటయ్య, రిటైర్డ్ ఆర్డీవో
డిచ్పల్లి, డిసెంబర్ 9:తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిగా మారడం శుభ పరిణామం. తెలంగాణలో తెరాస అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఉచిత విద్యలో భాగంగా గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించారు. ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారడంతో దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ పరిపాలనను అందించే అవకాశముంటుంది.
– పి.నర్సింహారెడ్డి, అధ్యాపకుడు, డిచ్పల్లి జూనియర్ కళాశాల
భారతదేశ నీటివనరులపై అధ్యయనం చేసిన కేసీఆర్… తెలంగాణ కోసం అపారమైన ఉద్యమ చైతన్యశీలత, సీఎంగా ప్రగతికాముక పథకాలు ఒడిసిపట్టుకొని దేశాన్ని భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా మలిచే చాణక్యత ఉన్నాయి. ఆ దిశలో వారి జాతీయ రాజకీయ ప్రస్థానం విజయవంతమవుతుంది. తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ దేశమంతా విస్తరించనున్నాయి.
-రాజ్‌కుమార్, సీనియర్ న్యాయవాది,కేశ్‌పల్లి
మోర్తాడ్, డిసెంబర్ 9: టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారడం తెలంగాణ వాసిగా సంతోషకరమైన విషయం. దక్షణాది నుంచి ఏ పార్టీ జాతీయస్థాయిలో ప్రాతినిథ్యం వహించలేదు. బీఆర్ఎస్ ఏర్పాటుతో తెలంగాణ ప్రాం తం నుంచి ఒక పార్టీ ప్రాతినిథ్యం వహించినట్లవుతుంది. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఏర్పాటును ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే.
– తులసీదాస్, అధ్యాపకుడు, మోర్తాడ్ జూనియర్ కళాశాల