మద్నూర్ : వింత వ్యాధితో కోళ్లు చనిపోతున్న దృష్ట్యా కామారెడ్డి (Kamareddy) జిల్లాకు చెందిన అధికారులు ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే కోళ్లపై (Chickens) ఆంక్షలు విధిస్తున్నారు. కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్న మద్నూర్ అంతరాష్ట్ర చెక్ పోస్టు (Check Post) సలాబత్పూర్ వద్ద శనివారం ద్విచక్రవాహనంపై కోళ్లను తీసుకొస్తున్న ఒకరిని వెటర్నరీ అధికారులు పట్టుకుని తిరిగి వెనక్కిపంపించారు. జిల్లాలో బర్డ్‌ఫ్లూ నివారణకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.