మాచారెడ్డి, ఏప్రిల్ 30 : మండల కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకు వచ్చి 15 రోజులు గడుస్తున్నా, తూకం వేయడం లేదని, అధికారులు నిర్ల క్ష్యం వహిస్తున్నారని కామారెడ్డి-సిరిసిల్ల రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు.
విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ శ్వేత అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. రైతులు ససేమిరా అనడంతో రెండు రోజుల్లో ధాన్యం తూకం వేస్తామని భరోసా ఇవ్వడంతో రైతులు ఆందో ళన విరమించారు. గంటపాటు ఆందో ళన చేయడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.