మోర్తాడ్, అక్టోబర్ 20: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఆదివారం వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం ప్రాజెక్ట్‌లోకి 46,942 క్యూసెక్కుల వరద వచ్చింది.
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు)కాగా, ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 1091అడుగుల (80.501టీఎంసీలు) నీటినిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 12 గేట్లు ఎత్తి 37,488 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కాకతీయ కాలువకు 5800, ఎస్కేప్గేట్ల ద్వారా 2200, లక్ష్మీకాలువకు 150, వరదకాలువకు ఐదు వేలు, సరస్వతీ కాలువకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.