రుద్రూర్, నవంబర్ 4 : మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియను అధికారులు సోమవారం ప్రారంభించారు. గత నెల 15వ తేదీన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఆదివారం వరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టలేదు.
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని కేంద్రం వద్ద వేసిన టెంటు కింద రైతులు కూర్చొని నిరసన తెలిపారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ‘ప్రారంభించారు.. పత్తాలేకుండా పోయారు’ శీర్షికన వార్త ప్రచురితమైంది. స్పందించిన సంబంధిత అధికారులు.. కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.