నిజాంసాగర్/బాన్సువాడ, జూన్ 17 : నిజామాబాద్ నగరంతోపాటు బోధన్ పట్టణానికి తాగునీటి అవసరాల కోసం నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా అలీసాగర్కు బుధవారం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఏఈ శివప్రసాద్, నీటి పారుదల శాఖ డీఈ జగదీశ్ మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
ప్రాజెక్టు నుంచి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నామని, నిజాంసాగర్ ప్రధాన కాలువ పరిసరాల్లోకి ప్రజలెవరూ రాకూడాదని, కాలువలోకి దిగరాదని, పశువులు, గొర్రెలను కూడా కాలువలో దించరాదని సూచించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 6.058 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని తెలిపారు.