నిజాంసాగర్, సెప్టెంబర్ 5:ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. 10 వేల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ఉండగా, మూడు గేట్లు ఎత్తి దిగువకు ఆ మేరకు నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగుల (17.802 టీఎంసీలు)లకు గాను, ప్రస్తుతం 1404 అడుగుల (17.079 టీఎంసీలు) మేర నిల్వ ఉంచి, మిగులు జలాలను దిగువకు వదులుతున్నట్లు ఏఈ శివప్రసాద్ తెలిపారు. మరోవైపు, నిజాంసాగర్ ఎగువన ఉండే సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో అక్కడ గేట్లను ఎత్తివేశారు. దీంతో ఆ నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరనున్నది.