e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home నిజామాబాద్ కేశాపూర్‌లో..ప్రగతి పరుగులు

కేశాపూర్‌లో..ప్రగతి పరుగులు

కేశాపూర్‌లో..ప్రగతి పరుగులు
  • పూర్తయిన పల్లె ప్రగతి పనులు
  • పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం
  • రూ.11లక్షలతో సీసీరోడ్డు,డ్రైనేజీల నిర్మాణం
  • అభివృద్ధిలో గ్రామస్తుల భాగస్వామ్యం

నిజామాబాద్‌ రూరల్‌, మే 30:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంలో అభివృద్ధికి అవసరమైన నిధులు కోట్లలో మంజూరవుతుండడంతో పల్లెలన్నీ ప్రగతిబాట పడుతున్నాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పల్లెప్రగతి ద్వారా మంజూరు చేసిన నిధులతో నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని కేశాపూర్‌ గ్రామ రూపురేఖలు మారిపోయాయి. అధికారుల పర్యవేక్షణ, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతో పల్లె ప్రగతి పనులు చకచకా పూర్తి చేశారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డుకు రెండువైపులా, గ్రామంలోని ప్రతి ఇంటి ఆవరణలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. జీపీ నిధులు రూ.5.51లక్షలతో ట్రాక్టర్‌ను కొనుగోలు చేశారు. గ్రామ శివారులోని త్రిమూర్తి ఎంటర్‌ప్రైజెస్‌ విరాళ రూపంలో అందించిన రూ.4 లక్షలతో ట్రాక్టర్‌ ట్రాలీ, వాటర్‌ ట్యాంకర్లను కొనుగోలు చేశారు.

రూ.3లక్షలతో కంపోస్ట్‌ షెడ్డు, డంపింగ్‌ యార్డు నిర్మించారు. ట్రాక్టర్‌ ట్రాలీ లో పారిశుద్ధ్య సిబ్బంది రోజూ ఇంటింటా తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తూ కంపోస్ట్‌ షెడ్డుకు తరలిస్తున్నారు. దీంతో గ్రామంలోని పరిసరాలు శుభ్రంగా మారుతున్నాయి. తడి చెత్తతో కంపోస్ట్‌ షెడ్డులో సేంద్రియ ఎరువును తయారుచేసి రైతులకు విక్రయిస్తున్నారు. రూ.9.60లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించి రోడ్డు వసతి కల్పించారు. పల్లెప్రకృతి వనంలో పెంచిన మొక్కలు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. ప్రకృతి వనంలో వీడీసీ సభ్యులు వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసి అభివృద్ధిలో తమ భాగస్వామ్యాన్ని చాటుతున్నారు. రోడ్లపై పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలను యువకులు, మహిళలు శ్రమదానంలో భాగంగా తొలగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రూ.22లక్షలతో రైతువేదిక భవనాన్ని నిర్మించి ఆ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద రూ.5లక్షలతో సీసీ రోడ్డును, జీపీ నిధులు రూ.6లక్షలతో సీసీ డ్రైనేజీ నిర్మించారు. హరితహారంలో నాటడానికి అవసరమైన 12వేల మొక్కలు గ్రామంలోని నర్సరీలో పెంచుతున్నారు.

ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
పల్లె ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేసుకున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రత్యేక నిధులతో మరింత ప్రగతి సాధిస్తాం. అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్ది ఆదర్శవంతంగా నిలిపేందుకు కృషి చేస్తా.
-మల్లె వనిత , సర్పంచ్‌, కేశాపూర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కేశాపూర్‌లో..ప్రగతి పరుగులు

ట్రెండింగ్‌

Advertisement