e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home నిజామాబాద్ పేదల విల్లాసం

పేదల విల్లాసం

పేదల విల్లాసం
  • గేటెడ్‌ కమ్యూనిటీ నివాసాలను తలపించేలా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు
  • కామారెడ్డి నియోజకవర్గంలో కండ్లుచెదిరే నిర్మాణాలు
  • జనగామ, జంగంపల్లిలో అందరినీ ఆకట్టుకుంటున్న 102 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు
  • ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, కాంట్రాక్టర్‌ సుభాష్‌రెడ్డి ప్రత్యేక చొరవ
  • అత్యాధునిక వసతులతో మోడల్‌హౌస్‌లా పేదలికిచ్చే ‘జీప్లస్‌ వన్‌’ నివాసాలు
  • ప్రైవేటు వెంచర్లను తలదన్నే రీతిలో తళుక్కుమంటున్న ఇండ్లు

నిజామాబాద్‌, జూన్‌ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):పచ్చదనంతో పరుచుకున్న పరిసరాలు, పూలమొక్కల వరుసలు, చుట్టూ ఫెన్సింగ్‌, ఎల్‌ఈడీ లైట్లు, యూపీవీసీ కిటికీలు, ‘జీప్లస్‌ వన్‌’ రీతిలో ఆకట్టుకునే హైఎండ్‌ డిజైన్డ్‌ ఇండ్లు. భూగర్భ మురుగునీటి వ్యవస్థ. కంటికి కనిపించని విద్యుత్‌ తీగలు. అలా చూస్తూ ఉండిపోవాలనిపించేలా భవన సముదాయం. ఇవేవో హైదరాబాద్‌లో కోట్లు విలువచేసే విలాసవంతమైన విల్లాలు కావు. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు. కామారెడ్డి నియోజకవర్గంలోని జంగంపల్లి, జనగామ గ్రామాల్లో నిర్మిస్తున్న ఈ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న నిధులకు తోడుగా ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చొరవతో అత్యాధునికంగా ఈ డబుల్‌ ఇండ్లు రూపుదిద్దుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే గంప కోరిక మేరకు కాంట్రాక్టర్‌ సుభాష్‌రెడ్డి మొత్తం 102 ఇండ్లను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. పేదల ఆత్మగౌరవం పెంచే విధంగా కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా డబుల్‌బెడ్‌రూం ఇండ్లను నిర్మించినట్లు వారు చెబుతున్నారు.

  • పచ్చదనం పరుచుకున్న పరిసరాలు. అందం గా అలకరించిన పూల మొక్కలు. చుట్టూ ఫెన్సింగ్‌తో రక్షణ కవచం. చూస్తుంటే చూడాలనిపించేలా భవన సముదాయం. జీప్లస్‌ వన్‌ రీతిలో ఆకట్టుకునే డిజైన్‌లో ఇండ్లు. అంతర్గత మురికి నీటి వ్యవస్థ. కంటికి కనిపించని విద్యుత్‌ తీగలు. నివాసాల్లో అంతర్గతంగా అత్యాధునిక సౌకర్యాలు. వంట గది, బాత్‌ రూమ్‌, గది లోపలంతా టైల్స్‌తో అమరిక. నల్లాలు, వైరింగ్‌ వ్యవస్థ అంతా నాణ్యమైన పరికరాలతో ఏర్పాటు చేశారు.
  • విల్లా మాదిరిగా…
  • ఇండ్ల నిర్మాణాల్లో భిన్నమైన శైలి రోజురోజుకూ పెరుగుతున్నది. డబ్బున్న వారంతా రూ.కోట్లు వెచ్చించి తమకు ఇష్టమొచ్చిన రీతిలో నివాసాలను తీర్చిదిద్దుకుంటున్నారు. పేదలకైతే అలాంటి అవకాశం ఉండదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం పేదల ఆత్మగౌరవం పెంచేలా డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు కట్టించి అందిస్తున్నారు. కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ స్వయంగా తన స్నేహితులతో కలిసి కొన్ని గ్రామాల్లో ఆదర్శవంతమైన ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. భిక్కనూర్‌ మండలం జంగంపల్లి, బీబీపేట మండలం జనగామ గ్రామాల్లో 102 ఇండ్లు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్‌ సుభాష్‌ రెడ్డి ఊరి రుణం తీర్చుకోవడం కోసం గ్రామానికి మంజూరైన 2బీహెచ్‌కే ఇండ్ల నిర్మాణాలను చేపట్టారు. లాభాపేక్ష లేకుండా అదనంగా తమ ఊరి జనాల కోసం అదనంగా మరిన్ని నిధులు కలిపి అధునాతన సౌకర్యాలతో 52 ఇండ్లు చేపట్టారు. జనగామలో చేపట్టిన ఇండ్లను చూసి ముగ్ధులైన ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఇతర గ్రామాల్లోనూ నిర్మాణాలు చేపట్టాలని కాంట్రాక్టర్‌ సుభాష్‌ రెడ్డిని కోరారు. విప్‌ విన్నపాన్ని అంగీకరించి జాతీయ రహదారి 44కు ఆనుకుని ఉన్న జంగంపల్లి గ్రామంలో 50 ఇండ్లు నిర్మించేందుకు గుత్తేదారు సుభాష్‌ రెడ్డి అంగీకరించారు. అనుకున్నదే తడవుగా చకచకా నిర్మాణాలు పూర్తి చేశారు. 102 ఇండ్లను రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా పూర్తి చేసి ఆకట్టుకుంటున్నారు.

రూ.లక్షన్నర అదనపు భారం..

- Advertisement -

ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పిలుపు మేరకు డబుల్‌ ఇండ్లను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన సుభాష్‌రెడ్డి.. ప్రతి ఇంటిపై అదనంగా రూ.లక్షన్నర వెచ్చించారు. సర్కారు ఇచ్చిన నిధులతో సంబంధం లేకుండా సొంతంగా ప్రజల మేలు కోసం ఆయన ఖర్చు చేశారు. డబుల్‌ ఇండ్ల సముదాయంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతోపాటుగా భూగర్భ విద్యుత్‌ వైరింగ్‌ను చేపట్టారు. ఇండ్ల చుట్టూ రక్షణకు ఫెన్సింగ్‌, ఎల్‌ఈడీ వీధి దీపాలు, అంతర్గతంగా సీసీ రోడ్లు, యూపీవీసీ కిటికీలు, ఇంట్లో టైల్స్‌ అమరికతో ప్రైవేటు వెంచర్లలో కనిపించే అత్యాధునిక భవంతులను తలపించేలా డబుల్‌ ఇండ్లను నిర్మించారు. రంగులు అద్దుకున్న ఇండ్లన్నీ ఇప్పుడు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. త్వరలోనే అర్హులైన వారందరికీ డబుల్‌ ఇండ్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ సుభాష్‌రెడ్డి చొరవను ప్రజలంతా అభినందిస్తున్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణాదారుడు గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తు రూపంలో 50 ఇండ్లను నిర్మించారు.

చూడముచ్చటగా ఉన్నాయి

కామారెడ్డి నియోజకవర్గంలోని జనగామ, జంగంపల్లిలో చేపట్టిన ఇండ్ల నిర్మాణాలు చూడముచ్చటగా ఉన్నాయి. జాతీయ రహదారి 44కు పక్కనే జంగంపల్లిలో నిర్మించిన డబుల్‌ ఇండ్లను చూసిన వారంతా ప్రైవేటు విల్లా అనుకుంటున్నారు. నా కోరిక మేరకు పేదల కోసం అద్భుతంగా ఇండ్లు నిర్మించిన సుభాష్‌ రెడ్డికి కృతజ్ఞతలు.
-గంప గోవర్ధన్‌, ప్రభుత్వ విప్‌

ప్రభుత్వ విప్‌ ప్రోత్సాహంతోనే..

డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల కాన్సెప్ట్‌ అద్భుతమైన ది. దేశంలో ఎక్క డా లేని విధంగా పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్‌ నెరవేరుస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రోత్సాహంతో జనగామ, జంగంపల్లి గ్రామాల్లో 102 ఇండ్లను నిర్మించడం సంతోషంగా ఉంది. ఇదంతా పుట్టి పెరిగిన గడ్డకు రుణం తీర్చుకోవడంలో భాగమే. అదనంగా భారం పడినప్పటికీ పేదల మేలు కోసం ముందడుగు వేశాను.
-సుభాష్‌ రెడ్డి, కాంట్రాక్టర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేదల విల్లాసం
పేదల విల్లాసం
పేదల విల్లాసం

ట్రెండింగ్‌

Advertisement