Traffic Police | వినాయక నగర్,మే28 : నిజామాబాద్ జిల్లా పోలీసు కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు జిల్లా కేంద్రంలో బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో కార్ల పై నిషేధిత బ్లాక్ ఫిల్మ్ వాడకం పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా కారు డోర్ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడుతున్న వాటినీ గుర్తించి బ్లాక్ ఫిలిం ను తొలగించి అనంతరం చట్టరీత్యా జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ మోటారు వాహనాల చట్టం, ఆర్టిఏ నిబంధనల ప్రకారం కార్ల డోర్ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేయడం నేరం, ఇది ప్రజల భద్రతకు హానికరమని అన్నారు. బ్లాక్ ఫిల్మ్ వలన వాహనాలలో కూర్చున్నవారిని వెలుపల నుండి చూడలేకపోవడం వల్ల అనేక నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
అందువల్ల ప్రజలందరూ ఈ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎవరైనా బ్లాక్ ఫిల్మ్ వాడితే వారి పై చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రజల్లో సురక్షిత డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించడానికి ఈ తరహా తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. జిల్లా ప్రజలకు బ్లాక్ ఫిల్మ్ ను వాహనాల పై వాడకూడదని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను గౌరవిస్తూ, పోలీసులకు సహకరించాలని అన్నారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్ఐ వినోద్, ఆర్ఎస్ఐ సుమన్ సిబ్బంది పాల్గొన్నారు.