Election | కంటేశ్వర్, ఆగస్టు 22 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ పట్టణ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగి సుమారుగా 99శాతం ఓటింగ్ జరిగినట్టు ఎలక్షన్ ఆఫీసర్స్ తెలిపారు.
ఎన్నికలలో పట్టణ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శివాజీ, వైస్ ప్రెసిడెంట్గా షారిక, కార్యదర్శిగా నరేందర్, కోశాధికారిగా శ్రీకాంత్, జాయింట్ సెక్రెటరీగా రామరాజు విజయం సాధించినట్లు ఎలక్షన్ అధికారులు తెలిపారు. కౌంటింగ్ పూర్తైన తర్వాత గెలిచిన అభ్యర్థులకు గెలుపు పత్రాలను అందజేశారు.
ఓటింగ్ లో పాల్గొన్న ఫొటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ కి గెలిచిన అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికల నిర్వహించిన ఎలక్షన్ అధికారులు, ఓటింగ్లో పాల్గొన్న ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ కి ధన్యవాదాలు తెలిపారు. అసోసియేషన్ లో ఎటువంటి సమస్యలు ఉన్న సామరస్యంగా పరిష్కరిస్తామని ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ కి ఎటువంటి ఇబ్బందులు కలిగిన అందరం కలిసికట్టుగా కలిసి నడుద్దామని అన్నారు.