పలు పోలీస్స్టేషన్ల పరిధిలో అనేక బైక్‌ల చోరీలకు పాల్పడిన పెర్కిట్‌కు చెందిన మహ్మద్ వహీద్ అలీని అరెస్ట్ చేసినట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో శనివారం విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. పట్టణంలోని సిద్ధుల గుట్ట వెనక ఉన్న ధోబీఘాట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో వహీద్ అలీని పట్టుకొని విచారించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ఆర్మూర్‌తోపాటు బాల్కొండ, నిజామాబాద్ రూరల్, జగిత్యాల్, ఆదిలాబాద్, నిజామాబాద్ 1వ టౌన్ పోలీస్‌స్టేషన్ ఏరియాల నుంచి కొన్ని రోజులుగా పార్కింగ్ చేసిన బైక్‌లను వహీద్ దొంగతనం చేశాడని విచారణలో తేలిందన్నారు.
పెర్కిట్‌కు చెందిన సాయికిరణ్ ఫిర్యాదు మేరకు వహీద్అలీని అరెస్ట్ చేశామన్నారు. సుమారు 10 కేసుల్లో రూ.5 లక్షల 45 వేల విలువై పది బైక్‌లను స్వాధీనపర్చుకున్నట్లు చెప్పారు. ఈ కేసును ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో సీఐ సురేశ్‌బాబు, ఎస్సైలు ప్రదీప్‌కుమార్, శ్రీకాంత్, ఏఎస్సైలు గఫర్, సలీం, కానిస్టేబుళ్లు గంగప్రసాద్, ఆనంద్, ప్రసాద్ ఛేదించారన్నారు. వీరికి నిజామాబాద్ సీపీ రివార్డులు అందజేసి అభినందించారు. అరెస్ట్ చేసిన నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఏసీపీ ప్రభాకర్‌రావు, సీఐ సురేశ్‌బాబు, ఎస్సైలు ప్రదీప్‌కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.