ఆర్మూర్/శక్కర్‌నగర్, జూన్ 17 : ఆర్మీ రిక్రూట్మెంట్లో అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు నిరసనగా ఆర్మూర్‌లోని పీవైఎల్, పీడీఎస్‌యూ ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, పీడీఎస్‌యూ ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు అనిల్‌కుమార్, నిఖల్, నాయకులు మనోజ్, విజయ్, కిశోర్, నవీన్, జైపాల్, వినోద్ పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. యువజన కాంగ్రెస్ నాయకుడు తలారే నవీన్ మాట్లాడారు.అంబేద్కర్ చౌరాస్తాలో పీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.