ఖలీల్‌వాడి, జూన్ 17 : ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో స్థిరపడాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా సూచించారు. జిల్లా కేంద్రంలోని న్యాక్(ఎన్ఏఎసీ)లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 48 మంది మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లను శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుద్యోగులకు న్యాక్ ద్వారా ప్రభుత్వం రూ.20వేల ఆర్థిక సహాయంతో పాటు ఉపాధి కల్పిస్తోందన్నారు. నగర మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్లు, నాయకులు, న్యాక్ కో-ఆర్డినేటర్, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
జిల్లా కేంద్రంలో పలురకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన 11 మందికి సీఎంఆర్ఎఫ్ కింద రూ.3,71,500 మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కులను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా శుక్రవారం అందజేశారు.