ఇందూరు, జూన్ 16 : కులసంఘాలకు చెందిన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. 14 కుల సంఘాలకు చెందిన 380 మంది ధర్నాలో పాల్గొ న్నారు. అనంతరం అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాకు వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా కుల సంఘాల ప్రతినిధి దాసరి గంగాధర్ మాట్లాడుతూ ఎల్కటూర్ గ్రామశివారులోని సర్వే నం.494లో 12 ఎకరాల 12 గుంటల భూమి ఉండగా, 20 ఏండ్ల క్రితం 4 ఎకరాల 20 గుంటల భూమిని కొనుగోలు చేశామన్నారు. 2 ఎకరాల 22గంటల భూమిని గురడి సంఘం వారు అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై తహసీల్దార్, ఎస్సైకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి 14 కుల సంఘాలకు న్యాయం చేయాలని కోరారు. బోడ నారాయణ, ముత్తెన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు.