నిజామాబాద్ లీగల్, జూన్ 15: నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్-ప్రియాంక జాదవ్ దంపతులు తమ కూతురు అంబికాజాదవ్ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి స్ఫూర్తిగా నిలిచారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశపత్రాన్ని నింపి 1వ తరగతిలో బుధవారం జాయిన్ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులకు కొదువలేద న్నారు. ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నవారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం బడుగు, బలహీన వర్గాల వారిలో స్ఫూర్తిని కలిగిస్తుందని వివరించారు.