కోటగిరి, జూన్ 15: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విలేజ్ పార్కులో పూల మొక్కలు పెంచాలని, వాటిని సంరక్షించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని విలేజ్ పార్కును కలెక్టర్ సందర్శించారు. పార్కులో నాటిన మొక్కలను పరిశీలించారు. పూల మొక్కలు నాటించి వాటిని సంరక్షించాలన్నారు. పార్కులో బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. పార్కులో పూల మొక్కలు పెంచితే విద్యార్థులు అక్కడ చదువుకుంటారని అన్నారు.
అనంతరం హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతర కోటగిరిలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. హరితహారంలో నాటించిన మొక్కలను సంరక్షించాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ విఠల్, ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్, ఎంపీవో మారుతి, ఏపీవో రమణ, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, ఉపాధ్యాయులు ఉన్నారు.