నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 15: జిల్లావ్యాప్తంగా పల్లెప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. బాల్కొండ పోలీసుస్టేషన్, ఎన్టీఆర్ కాలనీలోని మోడల్ స్కూల్ ఆవరణలో మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణ, ఎంపీడీవో సంతోష్‌కుమార్ ఆదేశాలతో శ్రమదానం చేసి పిచ్చిమొక్కలను తొలగించారు. గ్రామ ప్రత్యేకాధికారి రాఘవేందర్, సర్పంచ్ బూస సునీత, ఎస్సై గోపి, విద్యాసాగర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రత్యేకాధికారులు మంగళవారం రాత్రి పల్లెనిద్ర చేపట్టారు. తడి, పొడి చెత్తపై మహిళలకు అవగాహన కల్పించారు. ప్రత్యేకాధికారులు ఎంపీవో శ్రీనివాస్, డీటీ భాస్కర్, గిర్దావర్ షఫీ, ఏపీఎం అనిల్‌కుమార్, ఏఈ శ్రీనివాస్ తదితరులు పల్లెనిద్రలో పాల్గొన్నారు.
కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్, హాసాకొత్తూర్ గ్రామాల్లో సర్పంచులు ఏనుగు పద్మ, సక్కారం అశోక్, ఎంపీడీవో సంతోష్‌రెడ్డి, గ్రామ కార్యదర్శులు రోడ్ల వెంట, డ్రైనేజీల్లో ఉన్న చెత్తను కార్మికులతో తొలగింపజేశారు. వైకుంఠధామాల్లో మొక్కలను నాటారు. భీమ్‌గల్ మండలంలోని బడాభీమ్‌గల్‌లో కొనసాగుతున్న పనులను గ్రామ ప్రత్యేకాధికారి, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, సర్పంచ్ సంజీవ్ పరిశీలించారు. ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్, తాళ్లరాంపూర్, తడ్పాకల్ తదితర గ్రామాల్లో చేపట్టిన పనుల్లో సర్పంచులు గుల్లె లావణ్య, పద్మ, రాధ, మంజుల, పత్తిరెడ్డి ప్రకాశ్ రెడ్డి, భీమనాతి భానుప్రసాద్, కుండ నవీన్, అధికారులు సంతోష్, అబ్దుల్ మాలిక్, నవీన్, టీఆర్ఎస్ నాయకులు కట్కం సాగర్, కిషన్, నరేందర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
నవీపేట మండలం అనంతగిరి గ్రామంలో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను ఎంపీవో రామకృష్ణ పరిశీలించారు. సర్పంచ్ రవీందర్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి పాపేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్‌లో ఎంపీడీవో సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో పల్లెప్రగతిపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బంది కలిసి గ్రామంలోని ప్రధాన వీధులను శుభ్రం చేశారు. సర్పంచ్ వనజా గోవర్ధన్ గౌడ్, ప్రత్యేకాధికారి గంగాధర్, సీసీ సరళ, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ధర్పల్లి మండలంలోని ఆదర్శ పాఠశాలలో సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్‌రాజ్, ఎంపీపీ నల్ల సారికా హన్మంత్‌రెడ్డి ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లతో కలిసి పాఠశాల ఆవరణలోని చెత్తను తొలగించారు. జక్రాన్‌పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీపీ కుంచాల విమలారాజు, వైస్ ఎంపీపీ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలో స్పెషల్ ఆఫీసర్లు పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. తిర్మన్‌పల్లి గ్రామంలో జీపీ ఇన్చార్జి దీప్‌చంద్ ఆధ్వర్యంలో తాగునీటి ట్యాంకుల వద్ద, రోడ్ల వెంట ఉన్న చెత్తను తొలగించారు. మండల స్పెషల్ ఆఫీసర్ రంజిత్‌రెడ్డి, ఎంపీడీవో రాములు నాయక్‌తో కలిసి పనులను పరిశీలించారు. వర్ని మండలం తగిలేపల్లిలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను మండల ప్రత్యేక అధికారి మధుసూదన్ తనిఖీ చేశారు. హెచ్ఎం రోజాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఎంపీడీవో బషీరుద్దీన్, సర్పంచ్ మైసం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.