కామారెడ్డి, జూన్ 15: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మో టారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎంవీఐ కృష్ణారెడ్డి, ఏఎంవీఐ అమృతవర్షిణి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవే టు పాఠశాలల బస్సులను రవాణా శాఖ అధికారులు బుధవారం తని ఖీ చేశారు. సిరిసిల్లా రోడ్, నిజాంసాగర్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో స్కూల్ బస్సులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలించొద్దని, 15ఏండ్లు పైబడిన బస్సులను వాడొద్దని హెచ్చరించారు. వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ అన్ని నిబంధనలు తప్పక పాటించాలన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో 270 స్కూల్ బస్సులు ఉండగా 80బస్సులకు మాత్రమే ఫిట్నెస్ చేసుకున్నారని, మరో 50బస్సులు 15ఏండ్లకు పైబడినవి ఉన్నాయని తెలిపారు. ఇంకా 139 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. బస్సు డ్రైవర్‌కు హెవీ మోటర్ లైసెన్స్, బ్యాడ్జి లైసెన్స్‌తోపాటు భారీ వాహనాలు నడపడంలో ఐదేండ్ల అనుభవం ఉండాలన్నారు. ఫిట్నెస్ లేని బస్సులను రోడ్లపై తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.