భీమ్‌గల్, జూన్ 14 : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా నుంచి రుద్రంగి వయా మానాల వరకు సుమారు రూ. 14.30 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్న డబుల్ రోడ్డు పనులను మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. పూర్తి నాణ్యతతో పనులు చేపట్టాలని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. భీమ్‌గల్ మండలం దేవక్కపేటలో అంతర్గతంగా రోడ్డుకిరువైపులా నిర్మిస్తున్న సీసీ డ్రైన్స్, నూతన రోడ్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.
పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు మానాల దేగావత్ తండాలో పలు శుభకార్యాల్లో పాల్గొనడానికి వెళ్తూ మార్గమధ్యంలో రహత్‌నగర్‌లో ఆగి గ్రామస్తులతో మంత్రి ముచ్చటించారు. పల్లెప్రగతి కొనసాగుతున్న తీరును గ్రామసర్పంచ్, కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట డీసీసీబీ వైస్‌చైర్మన్ రమేశ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మలావత్ ప్రకాశ్, కొత్తతండా సర్పంచ్ తిరుపతినాయక్, దేవన్‌పల్లి సర్పంచ్ గంగాధర్, రహత్‌నగర్ సర్పంచ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.