నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్14: పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మాక్లూర్ మండలంలోని డీకంపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వీధులన్నీ కలియ తిరుగుతూ.. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి ట్యాంకును పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సాధుల భోజన్న, కాలగడ్డ దేవన్న తదితరులు పాల్గొన్నారు.
నందిపేట్ మండలంలోని సిద్ధాపూర్, తొండాకూర్, వన్నెల్(కే) గ్రామాల్లో ఉన్న బృహత్ పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలను జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు పరిశీలించి సంతృప్తిని వ్యక్తంచేశారు. గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఆరోగ్యం కూడా బాగుంటుందని ఆయన గ్రామస్తులకు సూచించారు. ఎంపీడీవో నాగవర్ధన్, తహసీల్దార్ అనిల్, ఈఈ బాబూరాం, ఏఈ కిషన్, సర్పంచులు లక్ష్మీనర్సయ్య, దేవన్న, ప్రభాకర్, రమేశ్, నాయకులు పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలంలోని దూస్‌గాం గ్రామాన్ని డీఆర్డీవో చందర్‌నాయక్ సందర్శించారు.

గ్రామంలోని పురాతన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవాటిని ఏర్పా టు చేయించాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఎంపీడీవో, ఎంపీవోలతో సమావేశం నిర్వహించి పల్లెప్రగతి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఎంపీడీవో గోపిబాబు, ఎంపీవో నాగేంద్రప్ప, టీఏలు రాజేశ్వర్, సుధాకర్ పాల్గొన్నారు. నడ్పల్లి తండాలో పల్లెప్రగతి పనులు, అనంతరం అంగన్వాడీ సెంటర్‌ను ఎంపీడీవో గోపీబాబు సందర్శించి చిన్నారుల హాజరును పరిశీలించారు. సర్పంచ్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీడీవో నటరాజ్ పర్యటించి పనులను పర్యవేక్షించారు. హోన్నాజీపేట గ్రామంలో క్రీడా మైదానం,పల్లెప్రకృతికి సంబంధించిన స్థలాలను నిజామాబాద్ ఆర్డీవో రవి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నటరాజ్, తహసీల్దార్ జయంత్‌రెడ్డి, సర్పంచ్ భగవంత్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కోటగిరి మండల కేంద్రంలోని వైకుంఠధామం, నర్సరీలను మండల ప్రత్యేకాధికారిణి నందకుమారీ పరిశీలించారు. ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్, ఎంపీవో మారుతి, ఏపీవో రమణ, పంచాయతీ కార్యదర్శి రాజేందర్ ఉన్నారు. కమ్మర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో తాగు పైపులైన్లు, వాటర్ ట్యాంకుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో చేపడుతున్న పనులను మెప్మా పీడీ, మండల ప్రత్యేకాధికారి రాములు అధికారులతో కలిసి పరిశీలించారు. వ్యక్తిగత లబ్ధికోసం అభివృద్ధి పనులను అడ్డుకుంటే చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఎంపీడీవో శంకర్, సర్పంచ్ లలితా రాఘవేందర్, కార్యదర్శి రాణి పాల్గొన్నారు. నవీపేట మండలంలోని జన్నేపల్లి తదితర గ్రామాల్లో కొనసాగుతున్న పనులను ఎంపీపీ సంగెం శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుడు బట్టు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. బాల్కొండలో పాత బావులు, బోరుబావులను గుర్తించి పూడ్చివేశారు. మండల ప్రత్యేకాధికారి రాఘవేందర్, సర్పంచ్ బూస సునీత, ఉపసర్పంచ్ షేక్ వాహబ్, పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.