నిజామాబాద్ స్పోర్ట్స్, జూన్ 9 : ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హోమ్‌లో జూలై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు కామన్వెల్త్ గేమ్స్- 2022 నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న కామన్వెల్త్ ట్రయల్స్ పోటీల్లో భాగంగా గురువారం నిర్వహించిన మొదటి మ్యాచ్‌లో నిజామాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్ విజయం సాధించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బాక్సింగ్ 50 కేజీల విభాగంలో హర్యానాకు చెందిన నవితను 5-0 తేడాతో మట్టికరిపించింది. ఢిల్లీలో ఈ పోటీలు ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి.