లింగంపేట/మాచారెడ్డి, జూన్ 9: మండలంలోని ఐలాపూర్ గ్రామాన్ని కేంద్ర బృందం సభ్యులు గురువారం సందర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద
గ్రామంలో చేపట్టిన పనుల పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామానికి చేరుకున్న అధికారులకు మహిళలు మంగళహారతి పట్టి స్వాగతం పలికారు. గ్రామానికి
చేరుకున్న అధికారులు ముందుగా పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రికార్డులు పరిశీలించిన
జాతీయ ఉపాధి హామీ పథకం కేంద్ర డైరెక్టర్ ధరమ్వీర్ ఝా గ్రామంలోని ఎస్సీ కాలనీలో వేసిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. పనులు చేసిన ప్రాంతాల్లో వివరాలతో
కూడిన ఫలకాలను పరిశీలించారు.
పనుల నిర్వహణకు సంబంధించి ప్రతి వివరా లు బోర్డులో రాయించాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామంలో నిర్మాణం చేపట్టిన
వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, కోతుల ఆహారశాలను పరిశీలించి బా గుందని కితాబునిచ్చారు. కోతుల ఆహారశాలలో మొక్కలకు పండ్లు కాయడంపై ఆయన సంతృప్తి
వ్యక్తం చేశా రు. అనంతరం ఊర చెరవులో పూడికతీత పనులు పరిశీలిచారు. శిఖం హద్దులు ఏర్పాటు చేసి కట్ట నిర్మా ణం చేయాలని అధికారులకు సూచించారు. ఆయన
వెంట ప్రాజెక్టు అధికారులు హన్సల్ సుతార్, రాజ్‌కుమార్ ప్రసాద్, కెపాసిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారి రుచి సిన్హా, రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్, కామారెడ్డి
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, సర్పంచ్ తుమ్మలపల్లి ధనలక్ష్మి, సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, ఏపీడీ శశికళ, ఎంపీడీవో శంకర్,
మండల పంచాయతీ అధికారి ప్రభాకర్ చారి, కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సంపత్‌గౌడ్, పంచాయతీ రాజ్ డీఈఈ గిరి, ఏఈ రాకేశ్, ఎంపీటీసీ సభ్యుడు
దేవేందర్, పంచాయతీ కార్యదర్శి ఫరీదాబేగం, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
కందకాల పరిశీలన
మాచారెడ్డి మండల కేంద్రంలో గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ శరత్ ఆధ్వర్యంలో కేంద్ర బృంద సభ్యులు పర్యటించారు.ఈ సందర్భంగా గత సంవత్సరం వరకు
ఉపాధిహామీ పథకంలో చేపట్టిన కందకాల తవ్వకం పనులను పరిశీలించారు. అనంతరం రికార్డులను పరిశీలించి కొలతలను తనిఖీ చేశారు.