మాక్లూర్/ కమ్మర్పల్లి(మోర్తాడ్)/ వేల్పూ ర్/ నిజామా బాద్ రూరల్/ రుద్రూర్, జూన్ 9: మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్‌లో సర్పంచ్ పుప్పాల లక్ష్మి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సత్యనారాయణ జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. ప్రభుత్వం అందజేస్తున్న సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. పశువైద్య సిబ్బంది శ్రీనివాస్, గంగారాం, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్పల్లి మండలంలోని నాగాపూర్, ఉప్లూర్ గ్రామాల్లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో 5782 గొర్రెలు, 349 మేకలకు పశువైద్యాధికారి రాజశేఖర్ నట్టలనివారణ మందును వేశారు. కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వేల్పూర్‌లో ఎంపీపీ భీమ జమున నట్టల నివారణ మందు పంపిణీని ప్రారంభించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి సంతోష్‌రెడ్డి, సర్పంచ్ తీగెల రాధ, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీటీసీ మొండి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తండా, కొత్తపేట, ముత్తకుంట గ్రామాల్లో జీవాలకు నట్టల నివారణ మందు వేసే కార్యక్రమాన్ని ఎంపీపీ బానోత్ అనూషాప్రేమ్దాస్ ప్రారంభించారు. మొత్తం 2400 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేసినట్లు పశువైద్యాధికారి ప్రమోద్‌కుమార్ తెలిపారు. పశు వైద్యశాల వీఏలు చిత్రసాయి, సుజాత, మహేందర్, కుమారస్వామి, సిబ్బంది జావిద్, సర్పంచులు హరిచంద్‌నాయక్, లావణ్య, జలంధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రుద్రూర్ మండలం చిక్కడ్‌పల్లిలో వెటర్నరీ అసిస్టెంట్ సాయి జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలతారమేశ్, కుర్మ సంగం అధ్యక్షుడు సాయిలు, మల్లయ్య, రాజు, శ్రీను, అబ్బులు, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.