నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 9 : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులతో పల్లెలు పరిశుభ్రతకు కేరాఫ్‌గా మారాలని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో గురువారం పారిశుద్ధ్య నిర్వహణ, చెత్తాచెదారం తొలగింపు, రోడ్లకు మరమ్మతులు తదితర పనులను చేపట్టారు.
డిచ్పల్లి మండలం యానంపల్లి, కొరట్పల్లిలో చేపట్టిన పనులను డీఆర్డీవో చందర్‌నాయక్, లింగసముద్రంలో చేపట్టిన పనులను ఎంపీవో నాగేంద్రప్ప పరిశీలించారు.
ధర్పల్లి మండల కేంద్రంలో చేపట్టిన పనులను ప్రత్యేకాధికారి రాజేందర్‌రెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్‌రాజ్ పరిశీలించారు. అందరి సహకారంతో ధర్పల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుదామని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సైఫుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ గంగదాస్, సిబ్బంది శ్యామేందర్, గంగాధర్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో పల్లెప్రగతి ఉత్సాహంగా కొనసాగుతున్నది. నల్లగుట్టతండా, అర్గుల్ గ్రామాల్లో చేపట్టిన పనులను ఎంపీడీవో లక్ష్మణ్ పరిశీలించారు.
ఇందల్వాయి మండలం వెంగళ్పాడ్ తండా, నల్లవెల్లి గ్రామాల్లో చేపట్టిన పనులను ఎంపీడీవో రాములునాయక్ పరిశీలించారు. ఆయనవెంట ఎంపీవో రాజ్‌కాంత్‌రావు, కార్యదర్శులు తదితరులున్నారు.
వర్ని మండలం నెహ్రూనగర్, శ్రీనగర్, వకీల్ ఫారం, హుమ్నాపూర్ తదితర గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టారు. ఎంపీడీవో బషీరుద్దీన్ పనులను పరిశీలించారు.
పల్లె ప్రగతితో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని బోధన్ డీఎల్పీవో గౌసొద్దీన్ అన్నారు. బోధన్ మండలంలోని బర్ధిపూర్, భూలక్ష్మీక్యాంప్, పెంటాకలాన్, పెగడాపల్లి గ్రామాల్లో పర్యటించి నర్సరీ, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మధుకర్, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో వైకుంఠధామం, కంపోస్టుషెడ్లను మండల ప్రత్యేకాధికారి నర్సింగ్‌దాస్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. బాల్కొండ మండలంలోని పలు మంచినీటి ట్యాంకులు, డ్రైనేజీలు, ముళ్ల పొదలు, పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేశారు. ముప్కాల్‌లో సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో దామోదర్, పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్ తదితరులు పంచాయతీ కార్మికులతో వీధులను శుభ్రం చేయించారు. రెంజల్ మండలంలోని కళ్యాపూర్, కిసాన్తండా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించినట్లు ఎంపీడీవో శంకర్ తెలిపారు. సర్పంచులు నిరంజని, జమున పాల్గొన్నారు.