వర్ని, జూన్ 8: వర్ని మండలం సిద్దాపూర్ గ్రామం వద్ద రూ.120 కోట్లతో నిర్మిస్తున్న రిజర్వాయర్ ద్వారా బాన్సువాడ నియోజకవర్గంలోని గిరిజన తండాల ప్రజలకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చా రు. కుల, మతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉంటున్న ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నా రు. వర్ని మండలం ఆఫందిఫారం గ్రామంలో రూ. 60లక్షలతో నిర్మించిన వంతెన, రూ.10లక్షలతో నిర్మించిన సేవాలాల్ మందిరం ప్రహరీని బుధవారం ఆయన ప్రారంభించారు.
వీటితోటు గ్రామం లో ఎనిమిది డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో స్పీకర్ మాట్లాడారు. దేశంలోని మరే రాష్ర్టాల్లో లేనంత అభివృద్ధి మన రాష్ట్రంలో చేస్తున్నప్పటికీ కొన్ని రాజకీయ పార్టీల నా యకులు నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారన్నారు. ఆయా పార్టీ ల పాలిత రాష్ర్టాల్లో ఇంత అభివృద్ధి, ఇలాంటి సంక్షే మ పథకాలు ఉన్నాయా అ ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పి తమ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతకుముందు గ్రానికి చేరుకున్న స్పీకర్‌కు మహిళలు గిరిజన సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ గిరిజన మహిళలతో కలిసి కొద్దిసేపు నృత్యం చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, వర్ని జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు పాల్గొన్నారు.