రుతు సంబంధమైన మృగశిర కార్తె (మిరుగు) పండుగను ఉమ్మడి జిల్లాలో బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. రైతులు వ్యవసాయ పనులను ప్రారంభానికి సూచికగా జరుపుకొనే పండుగ కావడంతో అన్నదాతలు మృగశిర ప్రవేశ సమయంలో ప్రకృతి ఆరాధనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కొన్నిచోట్ల విత్తనాలు వేశారు. మిరుగురోజు చేపలు, మామిడిపండ్లు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో మార్కెట్లో చేపలు, పండ్లకు గిరాకీ పెరిగింది. చేపల విక్రయాలు జోరుగా సాగాయి. ఈ ఏడాది చెరువుల్లో నీళ్లు నిండుగా ఉండడంతో గ్రామాల్లోనూ చేపలు పుష్కలంగా లభించాయి.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 8